![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి తెలిసిందే. ఈ సీజన్ హిట్ అవ్వడానికి హోస్ట్ నాగార్జున ఓ కారణం అయితే ఇందులోని కంటెస్టెంట్స్ మరో కారణం. హౌస్ లోకి వచ్చిన వారిలో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్ బేస్ బాగుంది. ఇక శివాజీ, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి, జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, ప్రియాంక జైన్ , ఇలా చెప్పుకుంటూ పోతే అందరు ఫేమస్ అవ్వడంతో ఈ సీజన్ హిట్ అయింది.
భోలే షావలి, అంబటి అర్జున్, అశ్వినిశ్రీ, పూజామూర్తి, నయని పావని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. వీరిలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ తో ట్రెండింగ్ లో ఉండేవారిలో అశ్వినిశ్రీ, నయని పావని ఇద్దరు ముందువరుసలో ఉన్నారు. బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్ అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.
ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్ళింది. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన నయని.. లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్లింది. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి వారం రోజుల్లో బయటకి వచ్చేసింది కానీ ఎంతో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. శివాజీని నాన్న అని పిలవడం.. నయని ఎలిమినేషన్ అప్పుడు శివాజీ ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ అప్పట్లో హైలైట్ గా నిలిచాయి. ఇక సీజన్ ముగిసాక స్పై బ్యాచ్ తో నయని పావని రాపో చూస్తే ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ సీజన్ సెవెన్ అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీకీ నయని పావని సెలెక్ట్ అయిందనే వార్త జోరందుకుంది. ఇక ఇప్పటికే భోలే షావలి కన్ఫమ్ అవ్వగా, తాజాగా నయని పావని సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. తన ఎలిమినేషన్ తో అన్యాయం జరిగిందని భావించిన నెటిజన్లు ఇప్పుడు తను సెలెక్ట్ అవ్వడంతో న్యాయం జరిగిందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ ఓటీటీలో స్పై బ్యాచ్ నుండి ఇద్దరు రావడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది.
![]() |
![]() |